Wednesday, 22 June 2016

చిన్నారులు

మా టీచర్ గారు నన్ను ఒక ఆర్టికల్ రాయమని అడిగారు అడిగి చాలా రోజులే అయింది. నా కైతే ఒక్క ఆలోచన కూడా రావట్లేదు అయితే నకప్పుడే గుర్తుకొచ్చారు మా చిట్టి పొట్టి చిన్నారులు అప్పుడు నాకు అనిపించింది నా చిన్నారి  మిత్రుల్ని గూర్చి ఒక ఆర్టికల్ రాయవచ్చు అని. ఈ మాటలే వారికి అంకితం

తామరాకులు మీద స్థిర పడ్డ కోమలమైన నీతి బుడగలు వంటి వారు. ఆకాశం నుంచి జారిపడ్డ నవ్వుల కానుకలు, భూమి మీద దాగున్న  నక్షత్రాలు,  నిన్నటికి రేపటికి మద్య సేతువులు, వికాస కేతువులు, శాంతి హేతువులు ,నిశ్వార్ద ప్రేమ పంచువారు, గగనన్ని తాకు పువ్వులు, తెల్లవారి గాలులలో సుగంధాలు, మకరందాన్ని ఆస్వాదించి సీతాకోక చిలుకలు , రేపటి కొసం చీకటి కోసే వేకువ కిరణాలు, వీరు గోరంత దీపలే కావచ్చు కానీ ఏదొక నాటికి కోడంత వెలుగులై చీకటి పారద్రోలు వారు,  మురలి వీణ గానం వంటి వారు, జీవితపు సంగీత రాగాలు, మదిలో మెదులు అమాయకపు చూపులు, కొండలలో వాగుల అల్లరులు, చిలిపితనానికి చిహ్నాలు, పండుగ పరిమళాలు, చూడడానికే బుడుగులు కదిలిస్తే చిచ్చరు పిడుగులు, చక్కటి నవ్వుల చిరుజల్లులు, చిక్కటి వాలుచూపులు, కవ్వించే అందాలు, నవ్వించే మాటలు, కన్నీళ్లు తెప్పించే ఆనందాలు, మురిపించే మల్లెలు, మైమరిపించే జ్ఞాపకాలు, కార్మికుని పనితనం వంటి వారు, పెద్దల ఆశీర్వాదాలు వంటి వారు, వారే మా ముద్దు ముద్దు మాటల, బుడి బుడి అడుగుల బుడుగులు చిచ్చర పిడుగులు

                                                                                                   -కె. భరద్వాజ్


                                                                       


No comments:

Post a Comment